హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఐఎస్‌సీయూఎఫ్) జాతీయ అధ్యక్షుడిగా మాజీ రాజ్యసభ సభ్యుడు సయ్యద్ అజీజ్‌పాషా ఎన్నికయ్యారు. చెన్నైలో ఈనెల 19-21 వరకు జరిగిన జాతీయ 24వ మహాసభల్లో 81 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
తెలంగాణ నుంచి ఉపాధ్యక్షుడిగా పీవీ దుర్గాప్రసాద్, కార్యదర్శిగా ఆర్ గోపాల్, కోశాధికారిగా హైకోర్టు న్యాయవాది కడారు ప్రభాకర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రొఫెసర్ సారంగపాణి, అవ్వ విజయలక్ష్మి, జాతీయ సమితి సభ్యులుగా మద్దినేని రమేశ్‌బాబు, కొండపర్తి శ్రీనివాసులు ఎన్నికయ్యారు.