IPL 2025 : పదిరోజుల విరామం తర్వాత ఐపీఎల్ చూద్దామనుకున్న అభిమానుకుల నిరాశ తప్పేలా లేదు. బెంగళూరులో వర్షం మరింత ఎక్కువైంది. దాదాపు గంట నుంచి చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో కుండపోతగా వాన కురుస్తోంది. దాంతో.. ఆర్సీబీ, కోల్‌కతా మ్యాచ్ పూర్తి స్థాయిలో 20 ఓవర్లు జరిగే అవకాశం లేదు.
ఎందుకంటే.. 8:45 నుంచే ఓవర్లు కోల్పోవడం జరుగుతుంది. సో.. వాన కాస్త తెరిపినిస్తే.. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా ఆడించాలని రిఫరీ, అంపైర్లు భావిస్తున్నారు. ఒకవైళ సిబ్బంది త్వరగా ఔట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేస్తే.. రాత్రి 10:56 నిమిషాలకు ఇరుజట్లు ఐదు ఓవర్లు ఆడనున్నాయి.
🚨 Update 🚨
The toss has been delayed due to rain. Stay tuned for further updates.#TATAIPL | #RCBvKKR pic.twitter.com/AQzBqFNV6M
— IndianPremierLeague (@IPL) May 17, 2025
ఐపీఎల్ 18వ సీజన్లో బ్రేక్ తర్వాత తొలి మ్యాచ్ కోసం ఆర్సీబీ ఫ్యాన్స్ భారీగా చిన్నస్వామికి చేరుకున్నారు. టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ గౌరవార్థం 18 నంబర్ తెలుపు జెర్సీలు ధరించారు చాలామంది. అయితే.. తీరా టాస్కు ముందే వాన మొదలైంది. దాంతో.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఆర్సీబీ, కోల్‌కతా ఆటగాళ్లు, అభిమానులు చినుకులు ఎప్పుడు తగ్గుతాయి? అని ఆకాశంకేసి చూస్తున్నారు.