ఇల్లెందు, మే 17 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించే క్రమంలో ఇల్లెందు రజకులకు మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో ధోబీ ఘాట్‌ను మంజూరు చేసింది. సింగరేణి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ధోబీ ఘాట్ నిర్మాణానికి రూ.2 కోట్ల అంచనా వ్యయంతో 2013లో పనులు ప్రారంభించింది. ప్రస్తుతం నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ ధోబి ఘాట్ కి ఒకవైపు స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించాడని రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
అయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై రజక సంఘ నాయకులు దుంపటి కృష్ణా ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధోబి ఘాట్ నిర్మాణం వెంటనే పూర్తి చేసి, ఆక్రమణకు గురైన స్థలాన్ని తమకు తిరిగి స్వాధీన పరచాలని రజక సంఘం నాయకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గోపగాని మల్లయ్య, కంచర్ల శ్రీను, మడవ రాజు, కె.శ్రీను, మెట్టపల్లి సాయిరాం, రాము పాల్గొన్నారు.
Yellandu : ఇల్లెందులో ధోబీ ఘాట్ స్థలం ఆక్రమణ, న్యాయం చేయాలని నిరసన