Timmapur | తిమ్మాపూర్, మే17: తిమ్మాపూర్ సర్కిల్ సీఐ గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న సదన్ కుమార్ ను మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బదిలీల్లో భాగంగా ఇక్కడ పని చేస్తున్న కర్రె స్వామి ఇతర ప్రాంతానికి బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ సదన్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు బండారి రమేష్ శాలువా కప్పి సత్కరించారు.
మండల పరిస్థితులపై మాట్లాడారు. ప్రజలు గ్రామాల్లో శాంతియుతంగా ఉండేందుకు నాయకులు కృషి చేయాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో పెంగిలి కృష్ణారెడ్డి, బిల్లా సంతోష్, జంగా రామకృష్ణారెడ్డి, వెన్నం సుధాకర్ రెడ్డి, నీలం ఆది రెడ్డి, కర్ర రమేష్, వెన్నం చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.