IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరుగనున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య జరాగాల్సిన మ్యాచ్ తేదీ మారనుంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో ఈ రెండు జట్లు తలపడాల్సి ఉంది. అయితే.. అదే రోజున శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. దాంతో, అటు శ్రీరాముడి శోభాయాత్ర, ఇటు మ్యాచ్‌కు పోలీసులు భద్రత కల్పించాల్సి వస్తుంది.
అందుకే.. కోల్‌కతా పోలీసులు బెంగాల్ క్రికెట్ సంఘానికి ఓ లేఖ రాశారు. స్టేడియం వద్ద భద్రతకు సిబ్బంది కొరత ఏర్పడుతుందని.. దయచేసి మ్యాచ్ తేదీ మార్చాలని ఆ లేఖలో కోరారు. అందుకని ఆ రోజు జరగాల్సిన మ్యాచ్‌ను మ్యాచ్‌ను ఏప్రిల్ 8వ తేదీన నిర్వహించేందుకు క్యాబ్ అంగీకరించింది. ఈ మేరకు శుక్రవారం ఐపీఎల్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6వ తేదీన డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం కోల్‌కతా, లక్నోలు తలపడాల్సి ఉంది. కానీ, తేదీ మారడంతో .. ఆ రోజు రాత్రి 730 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ మ్యాచ్ యథావిధిగా జరుగనుంది. 17వ సీజన్లో కూడా పండుగల సందర్బంలో మ్యాచ్ తేదీలను మార్చిన సంగతి తెలిసిందే.