IPL 2025 : సొంతమైదానంలో ఓటమన్నదే ఎరుగని చెన్నై సూపర్ కింగ్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. యశ్ దయాల్ వేసిన 13వ ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత ఓపెనర్ రచిన్ రవీంద్ర(41) బౌల్డ్ కాగా.. ఐదో బంతికి ఇంప్యాక్ట్ ప్లేయర్ శివం దూబే(19)సైతం బౌల్డ్ అయ్యాడు. దాంతో, సీఎస్కే 80 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా(1), అశ్విన్(1)లు క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లకు స్కోర్.. 81-6. ఇంకా చెన్నై విజయానికి 42 బంతుల్లో 116 పరుగులు కావాలి.
భారీ ఛేదనలో సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. తన మొదటి ఓవర్లోనే హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీసి సీఎస్కేను దెబ్బకొట్టాడు. మొదట ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(5)ను.. ఆఖరి బంతికి రుతురాజ్ గైక్వాడ్(0)ను డకౌట్‌గా డగౌట్‌కు చేర్చాడు. దాంతో, 8 పరుగులకే ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర(41) దీపఖ్ హుడా(4)లు ఆచితూచి ఆడారు. అయితే. భువనేశ్వర్ బౌలింగ్‌లో రివ్యూ తీసుకొని హుడా వికెట్ సాధించింది బెంగళూరు. ఆ తర్వాత వచ్చిన సామ్ కరన్(4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఇంప్యాక్ట్ ప్లేయర్ శివం దూబే(19) హడలెత్తించినా.. యశ్ దయాల్ తన 13వ ఓవర్లో డేంజరస్ రచిన్, దూబే.. ఇద్దరినీ బౌల్డ్ చేసి సీఎస్కేను ఓటమి అంచుల్లోకి నెట్టాడు.
Regular wickets, tight spells, and our boys have done extremely well so far.
Required rate is over 13 and we smell more wickets! 👃#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #CSKvRCB pic.twitter.com/RiB4Y3Pwiw
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025