Lava Mobiles Sale | లావా మొబైల్స్ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. కంపెనీ ఏర్పడి 16 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కస్టమర్లకు యానివర్సరీ సేల్‌ను అందిస్తోంది. మార్చి 30వ తేదీన కేవలం ఒక్క రోజే ఈ సేల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా లావాకు చెందిన పలు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఆడియో ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్‌ను, ఆఫర్లను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా మొదటి 100 మంది కొనుగోలుదారులకు కేవలం రూ.16కే అగ్ని 3 స్మార్ట్ ఫోన్‌ను, ప్రొ వాచ్ వి1 స్మార్ట్ వాచ్‌ను అందించనున్నారు. మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అగ్ని 3 సేల్‌ను నిర్వహిస్తారు. మొదటి 100 మంది కస్టమర్లు ఈ ఫోన్‌ను రూ.16కే కొనవచ్చు.
అదే రోజు సాయంత్రం 7 గంటలకు ప్రొ వాచ్ వి1 వాచ్‌కు గాను సేల్‌ను నిర్వహిస్తారు. దీన్ని కూడా మొదటి 100 మంది కస్టమర్లు రూ.16కే కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్స్‌ను పొందేందుకు గాను కస్టమర్లు AGNI3, PROWATCH అనే కూపన్ కోడ్లను ఉపయోగించాల్సి ఉంటుంది. లావా తన 16వ యానివర్సరీ సేల్ సందర్భంగా పలు ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తోంది. రూ.25,499 విలువైన లావా అగ్ని 3 5జి స్మార్ట్ ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.16వేలకే కొనవచ్చు. లావా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లోనూ ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు. అలాగే లావా బ్లేజ్ డ్యుయో 5జి ఫోన్‌ను రూ.13,799 కొనవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.18,999గా ఉంది. రూ.12,999 ధర ఉన్న లావా బ్లేజ్ 3 5జి ఫోన్‌ను రూ.9,899 ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో ట్రూవైర్‌లెస్ ఇయర్ బడ్స్, పవర్ బ్యాంకులపై కూడా డిస్కౌంట్లను అందించనున్నారు. రూ.2,999 విలువైన ప్రొ బడ్స్ ఎన్32 ఇయర్ బడ్స్‌ను ఈ సేల్‌లో రూ.999కే సొంతం చేసుకోవచ్చు. రూ.2,499 విలువైన ప్రొ బడ్స్ ఎన్31 ఇయర్ బడ్స్‌ను రూ.799 కు కొనవచ్చు. రూ.2499 విలువైన ప్రొ బడ్స్ టి31 ఇయర్ బడ్స్‌ను రూ.999కు, 1599 విలువైన పిబి11 బడ్స్‌ను రూ.799కు కొనవచ్చు. రూ.4,999 విలువైన ప్రొవాచ్ వి1 వాచ్‌ను కేవలం రూ.1616కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ప్రొ వాచ్ ఎక్స్ వాచ్‌ను రూ.3,779కు కొనవచ్చు. ఈ వాచ్ అసలు ధర రూ.6,999గా ఉంది. రూ.5,999 విలువైన ప్రొ వాచ్ జడ్ఎన్ను రూ.2,699కు కొనుగోలు చేయవచ్చు.
ఈ ఉత్పత్తులను సేల్ నిర్వహించే తేదీ రోజు లావా వెబ్ సైట్తోపాటు అమెజాన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఎందులో కొనుగోలు చేసినా ఆఫర్లు వర్తిస్తాయి. సేల్‌లో ఎప్పుడైనా ఆ రోజు ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇక కేవలం ఒక రోజు మాత్రమే ఉండే ఈ సేల్ ద్వారా కస్టమర్లకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు తెలిపారు. తమ యానివర్సరీ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఒకరోజు సేల్‌లో ఇంకా అనేక ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపారు.