మిర్యాలగూడటౌన్, ఫిబ్రవరి 22 : నాగర్ కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంపై దాడిచేసి, రెండు నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని అమరుల స్థూపం వద్ద బీసీ జేఏసీ, రజక సంఘాల ఆధ్వర్యంలో పసిపాప మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంతో మల్లన్న దేవుని దర్శనానికి వెళుతుండగా కొంతమంది అగ్రకులానికి చెందిన వారు అడ్డుకొని, రెండు నెలల పసికందు ఉందని కూడా చూడకుండా దాడికి పాల్పడటంతో పాప మృతి చెందిందన్నారు. ఇందు కు కారకులైన వారిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో యర్రబెల్లి దుర్గయ్య,బీసీ యువజన సంఘం జిల్లా నాయకులు కుమ్మరి కుంట్ల సుధాకర్, ఎస్పీ నాయుడు, తుపాకుల తుకా రాం, వెంకన్న, సైదులు,నారాయణ, బాలరాజు, యాదగిరి, దోమలపల్లి నవీన్, రాంగౌడ్, శ్రీనివాస్, లవకుమార్, స్వాతి, లావణ్య, త్రివేణి, పార్వతి, గాయత్రి, శ్రీలత పాల్గొన్నారు.
కోదాడ, ఫిబ్రవరి22 : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కులస్తులపై జరిగిన దాడిని ఖండిస్తూ కోదాడలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రజక కుటుంబంపై దాడి చేసి రెండు నెలల పసిబిడ్డ మృతికి కారణమైన నిందితులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని, నిర్లక్ష్యం వహించిన స్థానిక ఎస్సైని వెంటనే తొలగించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. రజక సంఘం పట్టణ నాయకులు, నాగేశ్వరరావు, ఎల్లయ్య, నాగేందర్, ఆదిలక్ష్మి, సురేష్, లింగయ్య, సతీష్, శ్రీను, శేఖర్, కృష్ణయ్య, యాదగిరి, స్వామి, భూమా శ్రీనివాస్, ఆతుకూరి భాస్కర్, కర్ల శివ, ఏర్పుల శ్రవణ్, కరుణాకర్, బీజేపీ నాయకులు పారెల్లి మహేష్, కర్ల ప్రేమానంద్ పాల్గొన్నారు.
గరిడేపల్లి,ఫిబ్రవరి 22 : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కులస్తులపై జరిగిన దాడి అమానుషమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రజక సంక్షేమ సంఘం జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పగిళ్ల హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ గరిడేపల్లిలో రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కళ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి భద్రత కల్పించడంతో పాటు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలన్నారు. యడవెల్లి వీరాస్వామి, చిక్కుళ్ల పిచ్చయ్య, చిక్కుళ్ల శేషగిరి,చిక్కుళ్ల వెంకన్న, పెద్ద రామకృష్ణ, మెకానిక్ వీరబాబు, హుస్సేన్, వెంకన్న, కనకమ్మ, నవీన్ పాల్గొన్నారు.