KL Rahul: సెంచూరియన్‌లో సెంచరీ వీరుడి అరుదైన ఘనత.. కెఎల్ రాహుల్ జబర్దస్త్ రికార్డు..
KL Rahul: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు 70 పరుగులు చేసిన రాహుల్.. రెండో రోజు ఫోర్లు, సిక్సర్లతో విజృంభించి సెంచరీ పూర్తి చేశాడు. టెస్టులలో రాహుల్‌కు ఇది 8వ సెంచరీ.
KL Rahul: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్.. సెంచూరియన్ టెస్టులో దిగ్గజ బ్యాటర్లకు సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. సెంచూరియన్ స్టేడియంలో బ్యాక్ టు బ్యాక్ టెస్టులలో సెంచరీ చేసిన తొలి పర్యాటక బ్యాటర్‌గా రాహుల్ రికార్డులకెక్కాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు 70 పరుగులు చేసిన రాహుల్.. రెండో రోజు ఫోర్లు, సిక్సర్లతో విజృంభించి సెంచరీ పూర్తి చేశాడు. టెస్టులలో రాహుల్‌కు ఇది 8వ సెంచరీ. గెరాల్డ్ కోయెట్జ్ వేసిన ఓవర్లో భారీ సిక్సర్ బాది సెంచరీ సాధించాడు.
రాహుల్.. భారత జట్టు 2021-22 పర్యటనలో భాగంగా గత డిసెంబర్లో సెంచూరియన్ వేదికగా జరిగిన టెస్టులో సఫారీలపై 260 బంతుల్లో 123 పరుగులు చేశాడు. తాజాగా ఇదే సెంచూరియన్‌లో భారత జట్టు టాపార్డర్ విఫలమైన వేళ.. రాహుల్ ఆదుకున్నాడు. 137 బంతుల్లో 101 పరుగులు చేశాడు.
KL Rahul in last 3 innings at Centurion in Test Cricket:
– 123(260).
– 23(74).
– 101(137).2 Hundreds in 3 innings – The Class, KL..!!! pic.twitter.com/vbIIUoAyH9
— CricketMAN2 (@ImTanujSingh) December 27, 2023
‘SENA’ దేశాలపై శతకాలు చేసిన రెండో కీపర్..
భారత్ తరఫున ఆడుతూ సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ (సెన) దేశాలపై సెంచరీలు చేసిన రెండో వికెట్ కీపర్ బ్యాటర్‌గా రాహుల్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో రిషభ్ పంత్ ఉన్నాడు. రాహుల్ తన కెరీర్లో మొత్తంగా 17 సెంచరీలు చేయగా అందులో ఓవర్సీస్లో చేసినవే 13 కావడం గమనార్హం. అదీగాక అతడి కెరీర్లో మూడు ఫార్మాట్లలోనూ సాధించిన శతకాలన్నీ విదేశాల్లోనే సాధించాడు.
KL RAHUL, THE MAN ON A MISSION.
– He has played one of the greatest hundred ever in Indian Test history. 🫡pic.twitter.com/YtWYxV6W0D
— Johns. (@CricCrazyJohns) December 27, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

