England Tour : ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరించే పనిలో నిమగ్నమైన బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్‌పై కూడా దృష్టి సారిస్తోంది. జూన్‌లో ఇంగ్లండ్ పర్యటన(England Tour) ఉన్నందున అంతకుముందే భారత ‘ఏ’ జట్టును అక్కడికి పంపనుంది. ‘ఇంగల్ండ్ లయన్స్’ జట్టుతో సిరీస్ కోసం స్క్వాడ్ ఎంపిక కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆటగాళ్ల ఎంపిక పూర్తి అయిందని.. త్వరలోనే పేర్లు ప్రకటించే అవకాశముందని సమాచారం. ఐపీఎల్లో దంచేస్తున్న కరుణ్ నాయర్ (Karun Nair), సీనియర్ జట్టులో చోటు ఆశిస్తున్నబెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) స్క్వాడ్‌లో ఉండడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటనకు ముందే సెలెక్టర్లు ఇంగ్లండ్ పర్యటనపై చర్చించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలెక్టర్లు మే 6న సమావేశమై.. భారత ఏ జట్టు ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే ఈ సిరీస్‌కు ఇండియా ఏ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ సారథిగా ఎంపికైనట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది దేశవాళీలో సెంచరీలతో చెలరేగిన కరుణ్ నాయర్ సైతం జట్టులో భాగం కానున్నాడు. త్వరలోనే .. అంటే మే 13న ఇంగ్లండ్ విమానం ఎక్కబోయే ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ ప్రకటించే అవకాశముంది. అభిమన్యు ఈశ్వరన్, తనుష్ కొతియాన్, బాబా ఇంద్రజిత్, ఆకాశ్ దీప్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డిలు స్క్వాడ్‌లో ఉండడం పక్కా. అయితే.. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, శార్ధూల్ ఠాకూర్లను సీనియర్ స్క్వాడ్‌లోకి పరిగణనలోకి తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.