Surendra Moga : రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ (Pakistan) మాట తప్పి, బరితెగించి శనివారం రాత్రి ఆర్ఎస్ పుర సెక్టార్ (RS Pura sector) లో చేసిన దాడుల్లో ఆర్మీ (Army) కి చెందిన ఇద్దరు, ఎయిర్‌ఫోర్స్ (Air force) కు చెందిన ఒక జవాన్‌తోపాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ (SI) ప్రాణాలు కోల్పోయారు.
ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సార్జెంట్ సురేంద్ర మోగా పార్థివదేహం కొద్దిసేపటి క్రితం రాజస్థాన్‌లోని ఆయన స్వగ్రామానికి చేరింది. ఝున్ఝును జిల్లాలోని మాండవ సురేంద్ర మోగా స్వగ్రామం. మోగీ పార్థివదేహం స్వగ్రామానికి చేరిందని తెలియగానే పరిసర గ్రామాలకు చెందిన జనం భారీ సంఖ్యలో ఆయనను చూసేందుకు తరలివచ్చారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఆ దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Rajasthan: Mortal remains of Sergeant Surendra Moga brought to his residence in Mandawa village of Jhunjhunu. He lost his life in the line of duty, during the shelling by Pakistan, in RS Pura sector. pic.twitter.com/WCHBNr6MU2
— ANI (@ANI) May 11, 2025