KTR | రాజన్న సిరిసిల్ల : బాధ పడుకుర్రి.. మహేశ్‌ను ఇండియాకు రప్పించి.. అన్ని విధాలా ఆదుకొనే బాధ్యత నేను తీసుకుంటా అని అతని కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశం పోయి, అక్కడ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మండేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మంద మహేశ్ కుటుంబాన్ని పరామర్శించారు.
సౌదీ అరేబియా దేశంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్‌తో వీడియో కాల్లో మాట్లాడి, అధైర్య పడొద్దని, అండగా నేనుంటా అంటూ మహేశ్‌కు ధైర్యం చెప్పారు. మనోళ్ళను పంపించి నీకు అండగా ఉండే విధంగా అన్ని రకాలుగా చూస్తానని మహేశ్‌కు కేటీఆర్ తెలిపారు. సొంత ఖర్చులతో ఇండియాకు రప్పిస్తానని మహేశ్‌కు భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చుల పరంగా మహేశ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోడానికి ముందుంటానని హామీ ఇచ్చారు కేటీఆర్.