SL vs NZ : సుదీర్ఘ ఫార్మాట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కమిందు మెండిస్(114) మరో సెంచరీ బాదేశాడు. స్వదేశంలో న్యూజిలాండ్ (Newzealand) బౌలర్లను చీల్చి చెండాడుతూ టెస్టుల్లో శతకంతో మెరిశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో రెండు స్థానాలు ముందు వచ్చినా తన విధ్వంసంలో తేడా లేదంటూ మెండిస్ వీరకొట్టుడు కొట్టాడు. తద్వారా సొంతగడ్డపై మూడంకెల స్కోర్ కలను నిజం చేసుకున్నాడు.
గాలే మైదానంలో ఆట ఆరంభంలోనే షాక్ తిన్న శ్రీలంకను కుశాల్ మెండిస్(50)తో కలిసి కమిందు ఆదుకున్నాడు. సెంచరీ భాగస్వామ్యంతో పర్యాటక జట్టు బౌలర్లను విసిగించాడు. 145 బంతుల్లోనే సెంచరీకి చేరువైన మెండిస్‌కు సొంత ప్రేక్షకులు అభినందనలు తెలిపారు. ఈ ఫీట్‌తో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన లంక ఆటగాడిగా మెండిస్ రికార్డు నెలకొల్పాడు. ఈ యంగ్‌స్టర్ 11వ ఇన్నింగ్స్‌లోనే 4వ టెస్టు సెంచరీతో ఔరా అనిపించాడు.
Kamindu Mendis held firm after early wickets, steering Sri Lanka to a strong position as they finish Day 1 the happier team.https://t.co/c36K1kauJJ #SLvNZ pic.twitter.com/kC28kbyLil
— ESPNcricinfo (@ESPNcricinfo) September 18, 2024
ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక విజయం నమోదు చేసిన శ్రీలంక సొంతగడ్డపై మాత్రం తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఆనందం తొలి సెషన్లోనే ఆవిరైంది. కివీ యువ పేసర్ విలియం ఓరూర్కే ధాటికి ఓవల్ శతక హీరో పథుమ్ నిశాంక(27)తో పాటు దిముత్ కరుణరత్నే(2), దినేశ్ చండీమాల్(30), ఆంజెలో మాథ్యూస్(36)లు చేతులెత్తేసిన చోట కమిందు మెండిస్(114) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు.
Test inns so far: 61, 102, 164, 92*, 9, 12, 113, 74, 4, 64 & 114 (today)
What is that consistency, Kamindu🥶#SLvNZ pic.twitter.com/5FIHHU34LJ
— ESPNcricinfo (@ESPNcricinfo) September 18, 2024
క్రీజులో కుదురుకున్నాక తనదైన షాట్లతో అలరించిన ఈ యువకెరటం అద్భుత శతకంతో చెలరేగాడు. ఒకదశలో 178కే సగం కోల్పోయి ఆలౌట్ ప్రమాదంలో పడిన లంకను ఒడ్డున పడేశాడు. కుశాల్ మెండిస్(50)తో కలిసి పట్టుదలగా ఆడి సెంచరీ భాగస్వామ్యంతో జట్టు స్కోర్ 300 దాటించాడు. ఈ ఇద్దరి పోరాటంతో మొదటి రోజు ఆట ముగిసే సరికి లంక మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.