Actor Ali | పవన్ కల్యాణ్‌తో దోస్తీపై ప్రముఖ కమెడియన్, వైఎస్సార్సీపీ మాజీ నేత అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌తో అనుబంధం మూడు పువ్వులు.. ఆరుకాయలుగా ఉందని.. ఆయనతో సినిమాల్లో కలిసి నటించే ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తానని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఉత్సవం మూవీ సక్సెట్ మీట్లో అలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు పార్టీ నేత జగన్ ఆదేశిస్తే పవన్‌పై సైతం పోటీ చేసేందుకు సిద్ధమని అలీ ప్రకటించారు. వాస్తవానికి పవన్ కల్యాణ్, అలీ గతంలో బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరి మధ్య స్నేహం చాలా సంవత్సరాలు కొనసాగింది. సినిమాలకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా సన్నిహితంగా మెదిలారు. ఆ సమయంలో పవన్ నటించిన సినిమాలు అన్నింటిలో అలీ కనిపించారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన అనంతరం అలీ వైఎస్సార్సీపీలో చేరారు.
ఆ తర్వాత ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించింది. జనసేనాని పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా నియామకమయ్యారు. ప్రస్తుతం అలీ మళ్లీ సినిమాల్లో ఫుల్ బిజీగా మారాడు. రెజినా, బ్రహ్మానందం, ప్రియదర్శి కీలకపాత్రలు పోషించిన ‘ఉత్సవం’ మూవీలో అలీ సైతం నటించాడు. మూవీ సక్సెస్ మీట్లో పవన్‌తో స్నేహం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. సినీరంగంలోనే ఉంటారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘మీరు తీసేస్తానంటే చెప్పండి.. రేపే వస్తా’ అంటూ ఛమత్కరించారు. ఈ సందర్భంగా తన డ్రీమ్ రోల్‌పై స్పందిస్తూ.. విలన్‌గా నటించాలనేది తన కోరిక అని.. కానీ తాను సీరియస్‌గా డైలాగ్స్ చెప్పినా ప్రేక్షకులు నవ్వుతున్నారని.. అయితే, వేరేభాష చిత్రాల్లో విలన్ పాత్ర పోషిస్తే అక్కడి ప్రేక్షకులు అంగీకరిస్తారేమోనని అనుపిస్తుందని చెప్పుకొచ్చారు.