ENG vs SL : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(80) రెండో టెస్టులోనూ సూపర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. లార్డ్స్‌లో శ్రీలంక (Srilanka) పేసర్ల ధాటికి తొలి సెషన్ మొదలైన కాసేటికే మూడు వికెట్లు పడిన జట్టుకు రూట్ ఆపద్భాదంవుడయ్యాడు. యువకెరటం హ్యారీ బ్రూక్(33)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు.
లంక బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరూ స్కోర్ 100 దాటించారు. చాపకింద నీరులా పరుగులు దొంగిలిస్తున్న ఈ జోడీని అసితా ఫెర్నాండో విడదీశాడు. తొలి టెస్టు శతక వీరుడు జేమీ స్మిత్(21) అండగా భారీ భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్న రూట్‌కు లంక బౌలర్లు బ్రేక్ వేశారు. మిలన్ రత్ననాయకే .. స్మిత్‌ను ఔట్ చేయడంలో ఇంగ్లండ్ స్కోర్ వేగం తగ్గింది. 50 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్.. 193/5.
Missed any of today’s action? 🤔
Catch up on all the highlights, right here 👇
— England Cricket (@englandcricket) August 29, 2024
ఓల్డ్ ట్రఫోర్డ్ స్టేడియంలో చిత్తుగా ఓడిన లంక రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా నమ్మకాన్ని నిలబెడుతూ లహిరు కుమార ఆదిలోనే బ్రేకిచ్చాడు. డేంజరస్ డానియెల్ లారెన్స్(9) ను ఔట్ చేసి లంకకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత మరో 9 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ సారథి ఓలీ పోప్(1)ను అసిథ ఫెర్నాండో బోల్తా కొట్టించాడు.
Sri Lanka make early inroads after opting to bowl first at Lord’s, removing England’s top three before lunch 🍴#ENGvSL ball-by-ball: https://t.co/kKZqez3EmQ pic.twitter.com/eyXSErewE3
— ESPNcricinfo (@ESPNcricinfo) August 29, 2024
తొలి సెషన్లో 42కే రెండు వికెట్లు పడిన దశలో ఓపెనర్ బెన్ డకెట్(40)తో కలిసి జో రూట్ ఇన్నింగ్స్ నిర్మించాడు. జట్టు స్కోర్ 82 వద్ద డకెట్ ఔటైనా ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్()తో మరో భాగస్వామ్యం నెలకొల్పాడు. లంక బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ అర్ధ శతకంతో చెలరేగిన రూట్ ఇంగ్లండ్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. అయితే.. మరోసారి మ్యాజిక్ చేసిన అసిథ డేంజరస్ బ్రూక్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, లంక ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.