INDW vs SLW : వన్డే ఛాంపియన్ భారత జట్టు తొలి సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. విశాఖపట్టణంలో జెమీమా రోడ్రిగ్స్ (69 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్ ఫామ్‌ను కొనసాగించిన జెమ్మీ.. స్మృతి మంధాన(25)తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేసింది. మంధాన ఔటైనా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(15 నాటౌట్)తో కలిసి కూల్‌గా ఆడిన జెమ్మీ.. టీమిండియాను 8 వికెట్లతో గెలిపించింది. మరో 5 ఓవర్లు మిగిలి ఉండగానే ప్రత్యర్థిని మట్టికరిపించిన భారత్ ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
స్వదేశంలో ఇటీవలే వన్డే ప్రపంచకప్ పట్టేసిన టీమిండియా.. టీ20 వరల్డ్‌కప్ సన్నద్ధతను ఘనంగా ఆరంభించింది. శ్రీలంకతో విశాఖలో జరిగిన తొలి టీ20లో భారత్ భారీ విజయం సాధించింది. మొదట శ్రీ చరణి(1-30), క్రాంతి గౌడ్(1-23)లు లంకను 121కే కట్టడి చేశారు. అనంతరం స్వల్ప ఛేదనలో షఫాలీ వర్మ(9) విఫలమైనా స్మృతి మంధాన (25) తన స్టయిల్లో రెచ్చిపోయింది. ఈ ఫార్మాట్లో 4 వేల క్లబ్లో చేరిన మంధాన.. కాసేపటికే రణవీర ఓవర్లో సిక్సర్‌కు యత్నించి వెనుదిరిగింది. దాంతో రెండో వికెట్‌కు జెమా రోడ్రిగ్స్(69 నాటౌట్)తో నెలకొల్పిన 54 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
Jemimah Rodrigues in full flow 💪
🎥 A flurry of fours from the #TeamIndia batter 👏
Updates ▶️ https://t.co/T8EskKzzzW#INDvSL | @JemiRodrigues | @IDFCFIRSTBank pic.twitter.com/SiRe5fCTRt
— BCCI Women (@BCCIWomen) December 21, 2025
ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(15 నాటౌట్)తో కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించింది జెమీమా. గిహ్మని వేసిన 12వ ఓవర్లో రెండు ఫోర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్న జెమీమా.. చివరి రెండు బంతుల్ని బౌండరీకి తరలించింది. దాంతో.. లక్ష్యం ఐస్ ముక్కలా కరిగిపోగా.. హర్మన్‌ప్రీత్ కూల్‌గా ఆడింది. రణవీర వేసిన 15వ ఓవర్లో జెమీమా సింగిల్ తీయగా8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా సిరీస్‌లో ముందంజ వేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. ఓపెనర్లు విష్మీ గుణరత్నే(39), చమరి ఆటపట్టు(15) శుభారంభమిచ్చిన ఆ తర్వాతి బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. శ్రీ చరణి(1-30), క్రాంతి గౌడ్(1-23)లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో బౌండరీలు రాబట్టేందుకు లంక బ్యాటర్లు తిప్పలు పడ్డారు. హాసిని పెరీరా(20), హర్షిత మాధవి(21)లు కీలక భాగస్వామ్యంతో లంక స్కోర్ వంద దాటింది. ఆఖర్లో.. కవిష దిల్హరి(8) మాత్రమే రాణించారు. దాంతో.. నిర్ణీత ఓవర్లలో లంక 6 వికెట్ల నష్టానికి 121కే పరిమితమైంది.