కుభీర్, డిసెంబర్ 21: మొన్నటి వరకూ గెస్ట్ లెక్చరర్‌గా సేవలందించిన జడి మాధవి (Jadi Madhavi) సర్పంచ్‌గా గెలుపొందారు. మండల కేంద్రం కుబీర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తూనే.. ఎన్నికల బరిలో నిలిచిన మాధవి సర్పంచ్ పదవిని సాధించారు. 2023 నుంచి GJC లో పాఠాలు చెబుతున్న ఆమె దస్తురాబాద్ మండలంలోని అకొండపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
డిసెంబర్ 22న సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న మాధవిని ఆదివారం కళాశాల ప్రిన్సిపల్ సునీల్ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు సత్కరించారు. శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మాధవి కళాశాలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు విద్యార్థులు, అధ్యాపకులు. ఇకపై గ్రామ సేవలో తరించనున్న మాధవికి వారంతా ఆల్ ది బెస్ట్ చెప్పారు.