DGCA – SpiceJet | నిధుల పరంగా సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్ లైన్స్ ‘స్పైస్ జెట్ (Spice Jet)’ మీద పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిఘా పెడుతున్నట్లు గురువారం ప్రకటించింది. స్పైస్ జెట్ ఆపరేషన్స్ సజావుగా సాగేందుకు స్పాట్ చెక్స్, రాత్రి వేళ నిఘా పెంచుతున్నట్లు తెలిపింది. ఆర్థిక పరంగా ఒత్తిళ్ల నేపథ్యంలో స్పైస్ జెట్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 7,8 తేదీల్లో సంస్థ ఇంజినీరింగ్ వసతులపై నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో కొన్ని లోపాలు కనిపించినట్లు డీజీసీఏ తెలిపింది.
స్పైస్ జెట్ గత రికార్డుతోపాటు ఈ నెలలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీ నేపథ్యంలో ఆ సంస్థ కార్యకలాపాలపై తక్షణం నిఘా పెంచుతున్నట్లు డీజీసీఏ వివరించింది. దీని ప్రకారం పలు దఫాలు స్పాట్ చెక్స్, రాత్రి వేళ నిఘా చర్యలు పెరుగుతాయి. స్పైస్ జెట్ విమాన సర్వీసులు సురక్షితంగా సాగేందుకే తాము ఈ చర్య తీసుకుంటున్నట్లు డీజీసీఏ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
Apple – Jobs | ఉద్యోగార్థులకు ఆపిల్ ఆఫర్.. ఏడు నెలల్లో ఆరు లక్షల కొలువులు