KCR : అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల (Ajmeer Dargah Ursu Celebrations) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) చాదర్ (పవిత్ర వస్త్రం) సమర్పించారు. ప్రతీయేటా గులాబీ పార్టీ తరఫున చాదర్ సమర్పించే కేసీఆర్.. ఈసారి కూడా సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆదివారం దర్గాకు చాదర్ సమర్పించిన ఆయన అనంతరం. మైనార్టీ నేతలతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ముస్లిం మత పెద్దలు, మైనారిటీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.