iQOO Z9s 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQOO Z9s 5G) ఫోన్ సేల్స్ గురువారం ప్రారంభించింది. కంపెనీ ఇండియా ఈ-స్టోర్, అమెజాన్ ద్వారా విక్రయాలు మొదలయ్యాయి. గత వారం ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ (iQOO Z9s Pro 5G) ఫోన్‌తోపాటు ఐక్యూ జడ్9 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQOO Z9s 5G) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్వోసీ (MediaTek Dimensity 7300 SoC) ప్రాసెసర్ తో పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQOO Z9s 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.19,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.23,999లకు లభిస్తాయి. ఓనిక్స్ గ్రీన్ (Onyx Green), టైటానియం మ్యాటె (Titanium Matte) కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై, ఈఎంఐ ట్రాన్సాక్షనపై రూ.2000 ఇన్ స్టంట్ క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. దీంతో ఐక్యూ జడ్9ఎస్ 5జీ ఫోన్ రూ.17,999లకే సొంతం చేసుకోవచ్చు.
ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQOO Z9s 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 387 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో 6.77 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2392 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సర్ మెయిన్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్ కలిగి ఉంటుంది.
Apple – Jobs | ఉద్యోగార్థులకు ఆపిల్ ఆఫర్.. ఏడు నెలల్లో ఆరు లక్షల కొలువులు