రెంజల్, డిసెంబర్ 21 : రెంజల్ మండలం బోర్గం గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా భార్యను హత్య చేశాడు భర్త. ఆదివారం సాయంత్రం బస్వా రెడ్డికి, భార్య మల్లుగారి రుక్మిణి(54)కి మధ్య గొడవ జరిగింది. దాంతో.. కోపోద్రిక్తుడైన బస్వారెడ్డి వ్యవసాయ పనులకు ఉపయోగించే పవడాతో రుక్మిణి తలపై బలంగా బాదాడంతో ఆమె అక్కడక్కడే మృతిచెందింది. భార్య హత్య చేసిన బస్వారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
బస్వారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని బోధన్ రూరల్ సీఐ. విజయ్ బాబు పరిశీలించారు. రుక్మిణి హత్యకు దారితీసిన కారణాలపై విచారణ చేపట్టారు. ఆమె మృతదేహాన్ని బోధన్ జిల్లా దవాఖానకు తరలించారు. బస్వా రెడ్డిపై హత్య కేసు నమోదు చేసి నట్లు రెంజల్ ఎస్ఐ కే. చంద్ర మోహన్ తెలిపారు.