Jio Hotstar : ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న జియో సంస్థ మరోమారు అభిమానులకు క్రీడా వినోదం పంచనుంది. త్వరలో భారత్, ఇంగ్లండ్ ఐదు టెస్టు మ్యాచ్‌ల డిజిటల్ మీడియా హక్కుల(Digital Rights)ను జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. సోనీ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటిడె సంస్థలతో పోటీపడి .. డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ విషయాన్ని క్రిక్‌బజ్ సోమవారం వెల్లడించింది.
జూన్‌లో మొదలయ్యే ఇంగ్లండ్ పర్యటన డిటిటల్ హక్కుల కోసం ఏప్రిల్ నెల నుంచే జియో హాట్‌స్టార్, సోనీ స్పోర్ట్స్, కల్వర్ మ్యాచ్స్ సంస్థల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. అయితే.. భారత జట్టుకు కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ (Shubman Gill)ను ప్రకటించిన తర్వాత చర్చలు చివరి దశకు వచ్చాయి. ఎట్టకేలకు ఆదివారం జియో హాట్‌స్టార్ ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అయితే.. సోనీ సంస్థ కూడా డిజిటల్ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు ఇరువురి మధ్య అంగీకారం కుదిరింది.
India🇮🇳 vs England🏴 Tests live on JioHotstar! 🏏📲
[Source : CricBuzz] pic.twitter.com/BlI0lsjaA7
— CricketGully (@thecricketgully) May 26, 2025
అంతేకాదు.. సోనీ టీవీ నెట్‌వర్క్స్‌లో కూడా భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అయితే.. ఇరు జియో, సోనీల మధ్య ఈ ఒప్పందం వచ్చ ఏడాది వరకూ కొనసాగనుంది. 2026లో భారత్.. ఇంగ్లండ్ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ ఎనిమిది మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో అభిమానులు ఆస్వాదించవచ్చని క్రిక్‌బజ్ తెలిపింది.
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య జూన్ 20న టెస్టుతో సిరీస్ మొదలవ్వనుంది. జూలై 2న బర్మింగ్హ్లో రెండో టెస్టు, అనంతరం జూలై 10న లార్డ్స్ వేదికగా మూడో టెస్టు, మాంచెస్టర్‌లో జూలై 23న నాలుగో మ్యాచ్.. ఓవల్‌లో జూలై 31న ఐదో టెస్టు జరుగనుంది.
Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪
A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq
— BCCI (@BCCI) May 24, 2025