Telugu University | తెలుగు యూనివర్సిటీ, మే 26 : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంత రావు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలుగు యూనివర్సిటీ నిర్వహించే శిల్పం-చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, శాస్త్రీయ నృత్యం (కూచిపూడి, ఆంధ్రనాట్యం), జానపదం, తెలుగు, చరిత్ర-పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా కోర్సుల కోసం ఎం.ఏ, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రాంలలో అర్హత కలిగి ఆసక్తిగల విద్యార్ధుల ప్రవేశం కోసం విశ్వవిద్యాలయం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
పూర్తి వివరాల కోసం www.teluguuniversity.ac.in, www.pstucet.org వెబ్ సైట్ లను సందర్శించాలని హనుమంతరావు సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను తేది 24-6-2025 లోగా సాధారణ రుసుముతో, తేది 30-6-2025 వరకు ఆలస్య రుసుముతో స్వీకరించడం జరుగుతుందని తెలియజేశారు.