WI vs SA : వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తిగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును హడలెత్తించిన సఫారీలు.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయలేకపోయారు. కైల్ వెర్రెయెన్నె(59), ఎడెన్ మర్క్రమ్(51)లు అర్ధ శతకాలతో రాణించినా మిగతావాళ్లు విఫలమయ్యారు. జైడన్ సీల్స్(6/61) ఆరు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా 246 పరుగులకే ఆలౌటయ్యింది. ఇంకా రెండు రోజుల ఆట ఉండడంతో విండీస్ జట్టు విజయంపై ధీమాతో ఉంది.
సొంతగడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ (West Indies) విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 144కే కుప్పకూలిన కరీబియన్ జట్టు 262 రన్స్ కొడితే సిరీస్‌లో ముందంజ వేస్తుంది. రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలెట్టిన దక్షిణాఫ్రికా తొలి వికెట్‌కు 79 రన్స్ చేసింది.
🚨 News from Providence: Play will start at 10:30am local time (about 10 minutes from now)
Lunch will be taken at 12:30pm 👉 https://t.co/PchR2SCx8c #WIvSA pic.twitter.com/hkZ3kRqmU4
— ESPNcricinfo (@ESPNcricinfo) August 17, 2024
ఎడెన్ మర్క్రమ్(51), కైల్ వెర్రియెన్నె(59)లు హాఫ్ సెంచరీలతో చెలరేగినా మిగతావాళ్ల నుంచి సహకారం అందలేదు. దాంతో, వర్షం అంతరాయానికి ముందు 225/5తో పటిష్ఠ స్థితిలో ఉన్న దక్షిణాఫ్రికా ఆ తర్వాత తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో షమర్ జోసెఫ్ విజృంభిస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో జైడెన్ సీల్స్(6/61)తన తాడాఖా చూపించాడు. కీలక వికెట్లు తీసి విండీస్‌ను పోటీలోకి తెచ్చాడు. నంద్రె బర్గర్()ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపిన సీల్స్ ఆరో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
With six in the bag, Jayden Seales finished with his best figures in Test cricket 🔥https://t.co/PchR2SCx8c #WIvSA pic.twitter.com/lO0L64w2Fx
— ESPNcricinfo (@ESPNcricinfo) August 17, 2024
తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా(South Africa) బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు నిలువలేకపోయారు. ఒక దశలో 100లోపే చాప చుట్టేస్తందనుకున్న విండీస్‌ను ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(54 నాటౌట్) ఆదుకున్నాడు. అతడు అర్ధ శతకంతో రాణించగా కేసీ కార్టీ(26) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో షమర్ జోసెఫ్(25) మెరుపులతో విండీస్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. సఫారీ పేసర్లు మల్డర్(4/32), నంద్రె బర్గర్(3/49)లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో వెస్టిండీస్ 144 పరుగులకే ఆలౌటయ్యింది. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దాంతో, ఈమ్యాచ్‌లో గెలిచిన టీమ్ సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లనుంది.