Oval Test : అండర్సన టెండూల్కర్ ట్రోఫీలో చివరి టెస్టుకు జట్టు కూర్పు భారత్‌కు సవాల్‌గా మారింది. మాంచెస్టర్ టెస్టులో నిరాశపరిచిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం సందేహమే. ఇప్పటికూ మూడు మ్యాచులు ఆడిన అతడిపై పని ఒత్తిడి, వెన్నునొప్పి భారం పడనుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ వైద్యులు యార్కర్ కింగ్‌కు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నారట. అదే జరిగితే పేస్ దళంలో ఆకాశ్ దీప్ ఉండడం ఖాయం.
ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో అరంగేట్రం చేసిన అన్షుల్ కంభోజ్ స్థానంలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్ యూనిట్లో శార్దూల్ ఠాకూర్‌పై వేటు ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే అతడి బదులు ఎవరు ఆడతారు? అనేది తెలియాల్సి ఉంది.
Jasprit Bumrah will not play the fifth and final Test of the Anderson-Tendulkar Trophy at The Oval starting on Thursday pic.twitter.com/y5X8QwpTJy
— ESPNcricinfo (@ESPNcricinfo) July 29, 2025
సిరీస్‌లో కీలకమైన ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కుతుందా అనేది ఆసక్తికరం. మాంచెస్టర్‌లో వీరోచిత శతకంతో జట్టును ఓటమి నుంచి తప్పించిన సుందర్ జట్టులో ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. సో.. పిచ్, వాతావరణం బట్టి పదకొండు మందిని ఎంపిక చేయనున్నారు కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జూలై 31న ఐదో టెస్టు జరుగనుంది