Newzealand : జింబాబ్వేతో జరగాల్సిన తొలి టెస్టుకు ముందే న్యూజిలాండ్(Newzealand)కు బిగ్ షాక్. భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున రెగ్యులర్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham) ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో, అతడి బదులు సీనియర్ బౌలర్ మిచెల్ శాంట్నర్(Mitchell Santner)కు కెప్టెన్సీ అప్పగించారు సెలెక్టర్లు. మంగళవారం శాంట్నర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో టెస్టుకు లాథమ్ అందుబాటులో ఉండే అవకాశముంది.
శాంట్నర్ టీ20ల్లో ఈమధ్య గొప్పగా రాణించాడు. అయితే.. టెస్టు ఫార్మాట్ మాత్రం విభిన్నం. కానీ, టెస్టు సారథ్యానికి శాంట్నర్ అర్హుడే. అతడికి ఆటగాళ్లలో గౌరవం ఉంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అతడికి సహకరిస్తారు. అందుకే.. శాంట్నర్‌కు పగ్గాలు అప్పగిస్తున్నాం అని హెడ్‌కోచ్ రాబ్ వాల్టర్ వెల్లడించాడు. జింబాబ్వే, కివీస్‌ల మధ్య జూలై 30న తొలి టెస్టు జరుగనుంది. అనంతరం ఆగస్టు 7 నుంచి 11 వ తేదీ వరకూ నిర్వహించనున్న రెండో టెస్టులో తలపడతాయి.
Squad News | Test captain Tom Latham has been ruled out of the first Test against Zimbabwe with a shoulder injury.
In Latham’s absence, white-ball captain Mitch Santner will lead the team, becoming New Zealand’s 32nd men’s Test captain. Full story | https://t.co/GDMAcfofdk… pic.twitter.com/GLmwlommYJ
— BLACKCAPS (@BLACKCAPS) July 29, 2025
న్యూజిలాండ్ టెస్టు స్క్వాడ్ (మొదటి టెస్టుకోసం) : టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫ్ఫీ, మాట్ ఫిషర్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, హెన్రీ నికోలస్, విలి ఓ రూర్కీ, అజాజ్ పటేల్, మైఖేల్ బ్రాస్‌వెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, విల్ యంగ్