IPL Jerseys Stolen : ఐపీఎల్లో తమ అభిమాన క్రికెటర్ల ఆటనే కాదు వాళ్ల జెర్సీ నంబరుతో కూడిన టీషర్ట్లు ధరించి మురిసిపోతారు అభిమానులు. ఫేవరెట్ క్రికెటర్ జెర్సీతో స్టేడియాల్లో తెగ సందడి చేస్తారు. ఇదిలా ఉంటే.. 18వ సీజన్లో పలు ఫ్రాంచైజీల జెర్సీలు చోరీకి గురయ్యాయి. ఏకంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆఫీస్ నుంచే రూ.6.5లక్షల ఖరీదైన జెర్సీలు మాయమైనట్టు సమాచారం. ముంబైలోని బీసీసీఐ ఆఫీస్‌లో పనిచేసే ఒక సెక్యూరిటీ గార్డు వీటిని దొంగిలించాడని కథనాలు వస్తున్నాయి.
బీసీసీఐ కార్యాలయం నుంచి భారీగా జెర్సీలను చోరీ చేసిన ఆ సెక్యూరిగార్డ్ పేరు ఫరూక్ అస్లాం ఖాన్. అతడు ఏకంగా 261 జెర్సీలను కాజేశాడు. ఒక్కో జెర్సీ ధర రూ.2,500 వరకూ ఉంటుంది. జూన్ 13న జెర్సీలు కనిపించలేదనే విషయాన్ని బీసీసీఐ సిబ్బంది గుర్తించారు.
Security breach at #Wankhede: Manager steals 261 IPL jerseys worth ₹6.5L fueled by gambling. #IPLTheft #mumbai
Read More: https://t.co/a4T6cS45Sr pic.twitter.com/069QN7IdO8
— myKhel.com (@mykhelcom) July 29, 2025
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చివరకు నిందితుడు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న ఫరూక్ అని తెలిసింది. అతడి అరెస్ట్ చేసిన పోలీసులు విచారించారు. ఫరూక్ ఆన్లైన్ గేమ్‌లకు బానిసగా మారాడని.. డబ్బుల కోసం ఈ పని చేశాడని తెలిసింది. దొంగిలించిన జెర్సీలను హర్యానాలోని ఒక డీలర్‌కు ఆన్లైన్ అమ్మినట్టు ఫరూక్ అంగీకరించాడు.