DTJA | ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్స్ అసోసియేషన్(డీటీజేఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా టి. శ్రీనివాసరావు( Tv5 బ్యూరో చీఫ్ ), తోగటి సూర్యకిరణ్(ఆంధ్రజ్యోతి చీఫ్ రిపోర్టర్) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శ్రీమతి పీ.కళా శ్రీనివాస్ (ప్రైమ్ 9 బ్యూరో చీఫ్) ఎండీ.మదార్ (V6 బ్యూరో చీఫ్), వర్కింగ్ ప్రెసిడెంట్ గా పీ గోపీకృష్ణ (10టీవీ బ్యూరో చీఫ్), కోశాధికారిగా ఏం.వి. శివరావు (BIG న్యూస్ బ్యూరో చీఫ్), సంయుక్త కార్యదర్శులుగా ఎం.సత్య (ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్), విద్యాసాగర్ (ఆంధ్రజ్యోతి కరస్పాండెంట్), ఎస్.నవీన్ కుమార్ (99 బ్యూరో చీఫ్)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాక్షి ఢిల్లీ ప్రతినిధి చైతన్యను అసోసియేషన్ సాదరంగా ఆహ్వానించింది.
అలాగే, మరికొందరు జర్నలిస్టులు కూడా అసోసియేషన్లోకి రావడానికి సిద్ధంగా వుండటం, వారితో సహా తెలుగు మీడియా లోపనిచేస్తున్న వీడియో జర్నలిస్టులతో కలిపి త్వరలోనే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, కమిటీని మరింత విస్తరించాలని సమావేశం నిర్ణయించింది. ఢిల్లీలో పనిచేస్తున్న తెలుగు మీడియా జర్నలిస్టులందరి సంక్షేమానికి, సమస్యలు, ఇబ్బందులు పరిష్కారానికి వీలైనన్ని అన్ని మార్గాల ద్వారా ఒక నిర్దిష్ణ కార్యాచరణ తో పనిచేయాలని నూతన కమిటీ నిర్ణయించింది.