Headingley Test : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(100 నాటౌట్) ఇంగ్లండ్ గడ్డపై శతక గర్జన చేశాడు. నిరుడు వెస్టిండీస్, ఆస్ట్రేలియా పర్యటనల్లో సెంచరీతో చెలరేగిన ఈ యంగ్ సంచనలం.. ఇంగ్లండ్ బౌలర్ల భరతం పడతూ ఐదోసారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు. హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో క్రీజులో పాతుకుపోయిన ఈ యంగ్‌స్టర్ విధ్వంసక సెంచరీతో జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు.
పేసర్ బ్రాండన్ కార్సే ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, ఆపై సింగిల్ తీసిన యశస్వీ టెస్టుల్లో వంద నమోదు చేశాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(58 నాటౌట్) కూడా చెలరేగి ఆడుతున్నాడు. దాంతో, టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ ఇద్దరి విధ్వంసంతో భారత్ టీ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది.
💯 for Yashasvi Jaiswal! 👏 👏
5th hundred in Test cricket! 👍 👍
This has been a fine knock in the series opener! 🙌 🙌
Updates ▶️ https://t.co/CuzAEnAMIW#TeamIndia | #ENGvIND | @ybj_19 pic.twitter.com/pGmPoFYik6
— BCCI (@BCCI) June 20, 2025