Kurapati | హనుమకొండ చౌరస్తా, జూన్ 20: హనుమకొండలోని కూరపాటి హాస్పిటల్లో లాప్రోస్కోపీ హెర్నియా చికిత్సలను అందిస్తున్న ప్రముఖ సర్జన్ డాక్టర్ కూరపాటి రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ వరంగల్ సెక్రటరీ డాక్టర్ అజిత్ మహమూద్, ప్రముఖ డాక్టర్లు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ కూరపాటి రమేశ్ మాట్లాడుతూ వర్క్‌షాప్‌లో లాప్రోస్కోపిక్ మెర్నియా శస్త్రచికిత్సలలో తాజా పద్ధతులు పరిచయం చేయడం, సర్జన్లకు ప్రత్యేక శిక్షణ, లైవ్ సర్జరీ డెమోస్, టాప్ బ్లాక్, మెష్ హెర్నియాప్లాస్టీ, 3డీ మెష్ వినియోగం గురించి వివరించారు.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఐదుగురికి ఉచితంగా ఆపరేషన్ చేసినట్లు, సామాన్యునికి అందుబాటులో ల్యాప్రోస్కోపి హెర్నియా సేవలు అందించాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూన్ నెల హెర్నియ అవగాహన మాసంగా పాటిస్తున్నట్లు, హెర్నియా అశ్రద్ధ చేయకూడదన్నారు.
కూరపాటి హాస్పిటల్లో జూన్ 30 వరకు ఉచిత హెర్నియా స్క్రీనింగ్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యంగ్ సర్జన్లకి శిక్షణిస్తూ ప్రోత్సహిస్తున్న కూరపాటి హాస్పిటల్, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్‌రెడ్డి, డాక్టర్ సుధాకర్ కల్పగిరి, డాక్టర్ వరుణ్‌బాబు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.