Duleep Trophy : దేశవాలీ లీగ్ అయిన దులీప్ ట్రోఫీ(Duleep Trophy)కి స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మలకు సెలెక్టర్లు విశ్రాంతినివ్వగా.. ఇప్పుడు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), పేసర్లు మహ్మద్ సిరాజ్(Mohammad Siraj), యంగ్ స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్‌లు టోర్నీ నుంచి వైదొలిగారు. సిరాజ్, ఉమ్రాన్లు అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకోనున్నారు.
ఇక ఇండియా -బికి ఆడాల్సిన జడేజా వ్యక్తిగత కారణాలు చెప్పినట్టు సమాచారం. దాంతో, సిరాజ్ స్థానంలో నవదీప్ సైనీ (Navdeep Saini), ఉమ్రాన్ బదులు మధ్యప్రదేశ్ పేసర్ గౌరవ్ యాదవ్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. సెప్టెంబర్ 5వ తేదీన అనంతపూర్‌లో దులీప్ ట్రోఫీ మొదలవ్వనుంది.
దులీప్ ట్రోఫీలో ఇండియా – ఏ, ఇండియా – బీ, ఇండియా – సీ, ఇండియా – డి.. మొత్తంగా నాలుగు జట్లు తలపడనున్నాయి. ఇండియా – ఏకు శుభ్‌మన్ గిల్ సారథ్యం వహిస్తుండగా.. ఇండియా- బీకి అభిమన్యు ఈశ్వరన్, ఇండియా – సీకి రుతురాజ్ గైక్వాడ్, ఇండియా – డీకి శ్రేయస్ అయ్యర్లు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.