ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొచ్చర వాగులో(Pochera river) చేపల వేటకు వెళ్లి(Fishing) ముగ్గురు యువకుల గల్లంతవగా(Youths Drowned) ఒకరి మృతదేహాం లభ్యమైంది. మిగతా ఇద్దరి కోసం పోలీసులు, స్థానిక జాలరులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన కూలీలు ఆకాష్, అక్షయ్, విజయ్ అనే ముగ్గురు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల్‌నాగాపూర్‌లో బంధువుల ఇంట్లో ఉంటున్నారు.
మంగళవారం ఆకాష్ , విజయ్ తమ బంధువైన శ్రీనివాస్‌తో కలిసి ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర వాగులో చేపల పట్టడానికి వెళ్లారు. చేపలు పడుతుండగా శ్రీనివాస్ వాగులో పడిపోగా ఆయనను రక్షించేం దుకు ఆకాష్ విజయ్‌లు ప్రయత్నించి వారు సైతం నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీస్, డీడీఆర్ఎఫ్ బృందాలు స్థానిక జాలర్లతో కలిసి గాలింపు చర్యలు చేపట్టాగా విజయ్ మృతి దేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి కోసం వాగులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.