IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత బౌలర్లను పరీక్షిస్తూ.. రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఆడిన జో రూట్ (150) ఎట్టకేలకు ఔటయ్యాడు. లంచ్ తర్వాత చెలరేగి ఆడిన అతడిని జడేజా పెవిలియన్ పంపాడు. జడ్డూ బౌలింగ్‌లో ఫ్రంట్ ఫుట్ వచ్చిన రూట్ బంతిని మిస్ అయ్యాడు. ఠక్కున బాల్‌ను అందుకున్న వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ వికెట్లను గిరాటేయగా.. స్టంపౌట్‌గా వెనుదిరిగాడు రూట్.
అంతకంటే ముందు కండరాలు పట్టేయడంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ (66) రిటైర్డ్ హర్ట్ గా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ జేమీ స్మిత్(9)ను బుమ్రా ఔట్ చేసి ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. ప్రస్తుతం క్రిస్ వోక్స్(2), డాసన్(14)లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్.. 523-6. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 165 పరుగుల ఆధిక్యంలో ఉంది.