Ravindra Jadeja : మాంచెస్టర్ టెస్టులో శతకంతో పాటు ఐదు వికెట్లు తీసిన బెన్ స్టోక్స్ (Ben Stokes) ‘ది బెస్ట్ ఆల్‌రౌండర్’గా ప్రశంసలు అందుకుంటున్న వేళ .. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) రికార్డులతో రెచ్చిపోతున్నాడు. ‘నేనూ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌నే’ అంటూ రికార్డుల మోత మోగిస్తున్నాడు.. ఉత్తమ ఆల్‌రౌండర్ భారత క్రికెటర్ మరో మైలురాయిని అధిగమించాడు.
మాంచెస్టర్ టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న జడేజా.. ఇంగ్లండ్‌పై వెయ్యి రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్‌లు థౌజండ్ క్లబ్లో చేరారు. ఇంగ్లండ్ పర్యటనలో బ్యాటుతో చెలరేగిపోతున్న ఈ ఆల్‌రౌండర్ 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన క్లబ్లో చేరాడు. విదేశీ గడ్డపై 1000 పరుగులు, 30కి పైగా వికెట్లు తీసిన మూడో ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు జడ్డూ. అతడి కంటే ముందు విల్ఫ్రెడ్ రోడ్స్(ఇంగ్లండ్), గ్యారీ సోబర్స్(వెస్టిండీస్)లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
In 148 years of Test Cricket
Only 3 Players with 1000 runs + 30 wickets in Visiting Countries
Wilfred Rhodes in AUS
Garry Sobers in ENG
Ravindra Jadeja in ENG*#ENGvsIND pic.twitter.com/UBXoQSDnzG— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) July 27, 2025
రోడ్స్ ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ నమోదు చేయగా.. ఇంగ్లండ్ మీద సోబర్స్ ఈ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ మీద తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న జడ్డూ.. స్టోక్స్ ఓవర్లో బౌండరీతో ఈ సిరీస్‌లో ఐదో అర్ధ శతకం సాధించాడు. 1966లో సోబర్స్ కూడా ఇంగ్లండ్‌పై ఇన్నేసి ఫిఫ్టీలు బాదాడు. భారత ఆటగాళ్ల విషయానికొస్తే.. జడ్డూ కంటే ముందు వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) వెస్టిండీస్‌పై 2002లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు.