IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు గండం గట్టెక్కింది. టాపార్డర్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకున్న వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్), రవీంద్ర జడేజా(50 నాటౌట్)లు పట్టుదలగా క్రీజులో నిలిచారు. ఒత్తిడిలోనూ ఖతర్నా్క్ ఇన్నింగ్స్ ఆడిన ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదారు. ఐదో వికెట్‌కు అజేయంగా 91 రన్స్ జోడించి తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చారు. స్టోక్స్ బౌలింగ్‌లో బౌండరీలో అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ 2 పరుగుల ఆధిక్యంలో ఉంది.
సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్‌లో సున్నాకే రెండు వికెట్లు. కొత్త బంతితో నిప్పులు చెరుగుతున్న ఇంగ్లండ్ పేసర్లను ఎదుర్కొని నిలుస్తారా? అనే సందేహాలను పటాపంచలు చేస్తున్నారు భారత మిడిలార్డర్ బ్యాటర్లు. నాలుగో రోజు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(103), కేఎల్ రాహుల్(90) అసమాన పోరాటంతో ఆదుకోగా.. ఐదో రోజు ఆల్‌రౌండర్లు జట్టను ఒడ్డున పడేసే బాధ్యత తీసుకున్నారు. లంచ్‌కు ముందే రాహుల్, సెంచరీ వీరుడు గిల్ పెవిలియన్ చేరినా.. మేమున్నామంటూ క్రీజులో పాతుకుపోయారు వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్), రవీంద్ర జడేజా(50 నాటౌట్)లు.
Another day, another solid half-century! 👌
Ravindra Jadeja now has 5 fifties in the last 6 Test innings 🙌
Updates ▶️ https://t.co/L1EVgGu4SI#TeamIndia | #ENGvIND | @imjadeja pic.twitter.com/eKxPb2VmgM
— BCCI (@BCCI) July 27, 2025
ఇంగ్లండ్ బౌలర్ల వ్యూహాల్ని చిత్తు చేస్తూ.. బౌన్సర్లును ఎదుర్కొంటూ ఐదో వికెట్‌కు అమూల్యమైన పరుగులు జోడించి టీమిండియాకు ఆధిక్యం అందించిందీ ద్వయం. స్టోక్స్ బౌలింగ్‌లో అర్ధ శతకాలు పూర్తి చేసుకున్న జడ్డూ, వాషీలు టీ బ్రేక్ వరకూ నిలిస్తే.. మ్యాచ్ చేజారుతుందోమోనని కోట్లాది అభిమానులు కంగారు కాసింత తగ్గినట్టే.