Srisailam Project | శ్రీశైలం, జులై 27 : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆదివారం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 34,088 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 31,504 క్కూసెక్కులు, సుంకేశుల నుండి 52,682 క్యూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 1,02,580 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరింది. ఒక్క గేటును 10 అడుగుల ఎత్తుతో తెరచి 26,698 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండగా కుడి, ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 66,417 క్యూసెక్కుల నీరు సాగర్‌కు చేరుకుంటుంది. అదే విధంగా జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198.81 టీఎంసీలు ఉన్నాయి.