Jeevan Reddy | జగిత్యాల, జూలై 27 : ఇండ్ల నిర్మాణాల కూల్చివేత బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం మినహా ఎక్కడా కూడా 150 ఎకరాలు సేకరించలేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల అర్బన్ నూకపల్లి హౌసింగ్ కాలనీ సందర్శించి గతంలో కేటాయించిన వివిధ దశలలో నిర్మాణం ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మాకు చెప్పకుండా కూలుస్తున్నారని లబ్ధిదారులు జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువ్చారు. దీంతో కూల్చిన ఇండ్లను మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జగిత్యాలలో ఇళ్లు లేని నిరుపేదలకు నూకపల్లిలో 4000 ఇల్లు కేటాయించి, ప్రభుత్వ నిధులు వెచ్చించారని, గత పాలకులు నిలిచిన ఇళ్లకు నిధులు కేటాయిస్తే ఇల్లు పూర్తి అయ్యేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు యథావిధిగా నిర్మాణం పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు ఎక్కడ పేరు వస్తదోనని డబుల్ బెడ్రూం నిర్మాణం చేపట్టారన్నారు. 2000 ఇందిరమ్మ ఇళ్లను కూల్చివేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం తెరపైకి తీసుకువచ్చారని, డబుల్ బెడ్రూ ఇల్లు తక్కువ స్థలంలో ఎక్కువ మంది లబ్ధిదారులు స్థలం అందుబాటులో ఉన్నచోట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అవసరం లేదన్నారు. 4000 మంది లబ్ధిదారుల్లో, అనర్హులు ఉంటే తొలగించవచ్చని, సొంత ఇంటి యజమానులను చేసేందుకు రూపొందించిన పథకం నూకపెల్లి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అని, 2018లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పేరిట తొలగించిన 2000 ఇళ్ల లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 2000 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఆన్లైన్లో లబ్ధిదారులుగా ఇల్లు ఉన్నట్టుగా చూపెడుతుండడంతో వారు నిరాశకు లోనవుతున్నారన్నారు.
వివిధ సందేశాల్లో నిర్మాణంలో ఉన్న 1611 ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదని, 2023 ఎన్నికలకు ముందు లబ్ధిదారులను గుర్తించి, ఇళ్లు మంజూరు చేశారని, మౌలిక వసతులు కల్పించకుండానే కేవలం ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇల్లు మంజూరు చేశారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి, ఇళ్ల నిర్మాణానికి, నిధులు మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారని, రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పనపై నిధులు కేటాయించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాగా జిల్లా అధికారులు రూ.52 కోట్లు అవసరం అవుతాయని నివేదిక ప్రభుత్వానికి అందజేశారన్నారు. నిరుపేదల సంక్షేమానికి పాటు పడాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని, దాదాపు 100 ఇళ్లను లబ్ధిదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇళ్లు తొలగించడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించామని, ఎఫ్ బ్లాక్ ఒకే దగ్గర 10 ఎకరాలు స్థలం ఉందని, ఏవిధమైన కూల్చివేతలు లేకుండా 20 ఎకరాల స్థలం లభిస్తుందని, ముందుగా నిరుపయోగంగా ఉన్నటువంటి స్థలాన్ని గుర్తించండని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లేఅవుట్ గుర్తించారని, లే అవుట్ లేకుండా డబుల్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారని, నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు నిధుల మంజూరుకు ప్రభుత్వ పరిశీలనలో ఉండగా ఇళ్లు కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు.
తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడితే, లబ్ధిదారుడికి ప్రత్యామ్నాయంగా కేటాయింపు చేయాలని, రాష్ర్ట ప్రభుత్వం 48 వార్డులకు అదనంగా రెండు వార్డులు ఏర్పాటు చేయాలని సూచిస్తే, 48 వార్డులను 50 వార్డులుగా చేశారని, మున్సిపల్ అధికారుల పని తీరు అర్థం కావడం లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి 20 నెలలు గడుస్తుందని, లబ్ధిదారులను తరలించలేకపోతున్నారని, అరకొర వసతులు ఉన్నా 25 శాతం మంది తరలి వెళ్లారని, మౌలిక వసతుల కల్పన తప్పనిసరిగా కల్పించాలని, నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఉపయోగించునేందుకు సిద్ధం ఉన్న డబుల్ బెడ్రూమ్ బ్లాక్‌లో తాత్కాలికంగా స్కూల్, హాస్పిటల్ ఏర్పాటు చేయవచ్చని, టెండర్ అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పనులు చేపట్టడం, మున్సిపల్ కమిషనర్ ఎం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్ళామని, ఇళ్ల కూల్చివేతల్లో కూడా గత పాలకుల పాలన కనపడుతుందని, తక్షణమే కలెక్టర్ శాశ్వత నిర్మాణాల కోసం స్థలాన్ని గుర్తించాలని, 2000 ఇల్లు తొలగించి, డబుల్ బెడ్రూమ్ నిర్మించిన జాబితాలో అర్హత ప్రాధాన్యతగా మంజూరు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాల కూల్చివేత బాధ్యులపై, చర్యలు తీసుకోవాలని, రాష్ర్టంలో ప్రాజెక్టు ల నిర్మాణం కోసం మినహా ఎక్కడా కూడా 150 ఎకరాలు సేకరించింది లేదని, కేవలం జగిత్యాలలో మాత్రమే ఇళ్ల నిర్మాణం కోసం సేకరించామన్నారు.
డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి 2000 ఇళ్ల నిర్మాణాల తొలగింపు లబ్దిదారులకు తక్షణమే, ఎవరికి కేటాయించని డబల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యతా ఇవ్వాలని, మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయింపు కోసం సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.