IND vs ENG : అనూహ్య మలుపులు తిరిగిన మాంచెస్టర్ టెస్టు డ్రాగా ముగిసింది. భారత మిడిలార్డర్ వీరోచిత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లు కుదేలవ్వగా.. టీమిండియా సిరీస్‌లో నిలిచింది. ఐదో రోజు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103) ఔటయ్యాక జట్టును గట్టెక్కించే బాధ్యతను భుజాన వేసుకున్న రవీంద్ర జడేజా(107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(101 నాటౌట్)లు చిరస్మరణీయ సెంచరీతో చెలరేగారు. ఐదో వికెట్‌కు అజేయంగా 203 రన్స్ జోడించిన ఈ ఇద్దరూ స్టోక్స్ సేన ఆశలపై నీళ్లు చల్లుతూ భారత జట్టును సిరీస్‌లో బరిలో నిలిపారు.
మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అసమాన పోరాటంతో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌ను డ్రాగా ముగించి ఔరా అనిపించింది. టీ సెషన్ తర్వాత కూడా రవీంద్ర జడేజా(107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(101 నాటౌట్)లు జిడ్డులా క్రీజునంటుకు పోవడంతో స్టోక్స్ డ్రా చేసుకుందామని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. అంపైర్ మీకు ఓకేనా అడగగా ఇద్దరూ తిరస్కరించారు. అప్పటికే ఇద్దరూ శతకానికి చేరువలో ఉన్నారు. కాసేపటికే బ్రూక్ ఓవర్లో బౌండరీతో 95కి చేరుకున్నాడు జడేజా. ఆ తర్వాత సుందర్ సైతం రూట్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో 90కి చేరువయ్యాడు. బ్రూక్ ఓవర్లో సిక్సర్‌తో జడ్డూ ఐదో శతకం సాధించాడు. ఇంగ్లండ్‌పై అతడికిది మూడో సెంచరీ. ఆ కాసేపటికే సుందర్ డబుల్ తీసి కెరీర్లో తొలిసారి వందకు చేరువయ్యాడు.
All’s well that ends well (?) #ENGvIND pic.twitter.com/k5375eF8am
— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2025
సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్‌లో సున్నాకే రెండు వికెట్లు. కొత్త బంతితో నిప్పులు చెరుగుతున్న ఇంగ్లండ్ పేసర్లను ఎదుర్కొని నిలుస్తారా? అనే సందేహాలను పటాపంచలు చేస్తున్నారు భారత మిడిలార్డర్ బ్యాటర్లు. నాలుగో రోజు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(103), కేఎల్ రాహుల్(90) అసమాన పోరాటంతో ఆదుకోగా.. ఐదో రోజు ఆల్‌రౌండర్లు జట్టను ఒడ్డున పడేసే బాధ్యత తీసుకున్నారు. లంచ్‌కు ముందే రాహుల్, సెంచరీ వీరుడు గిల్ పెవిలియన్ చేరినా.. మేమున్నామంటూ క్రీజులో పాతుకుపోయారు వాషింగ్టన్ సుందర్(107 నాటౌట్), రవీంద్ర జడేజా(101 నాటౌట్)లు.
Five days of hard-fought cricket end in Manchester with India batting 143 overs to secure a draw 👊
England take a 2-1 lead into the series finale at The Oval
Scorecard: https://t.co/bFpNZVmJPb pic.twitter.com/znSFWe353l
— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2025
ఇంగ్లండ్ బౌలర్ల వ్యూహాల్ని చిత్తు చేస్తూ.. బౌన్సర్లును ఎదుర్కొంటూ ఐదో వికెట్‌కు అమూల్యమైన పరుగులు జోడించి టీమిండియాకు ఆధిక్యం అందించిందీ ద్వయం. స్టోక్స్ బౌలింగ్‌లో అర్ధ శతకాలు పూర్తి చేసుకున్న జడ్డూ, వాషీలు టీ బ్రేక్ తర్వాతా అదే పట్టుదలను ప్రదర్శించారు. టీ బ్రేక్ తర్వాత జోరు పెంచిన వీళ్లు సెంచరీకి చేరువయ్యారు. స్టోక్స్ డ్రా రిక్వెస్ట్‌ను తోసిపుచ్చిన తర్వాత ఇరువురు బౌండరీలతో విరుచుకుపడి శతకాలు సాధించారు. ఐదో వికెట్‌కు 203 రన్స్ చేసి టీమిండియా పవర్ చూపించిన ఈ జోడీకి హ్యాట్యాఫ్ చెబుతున్నారు అభిమానులు.