CM Stalin : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM Stalin) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వారం రోజుల క్రితం తల తిరగడంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన ఆయన కోలుకున్నారు. దాంతో, ఆదివారం స్టాలిన్ ఇంటికి వెళ్లారు. సీఎంను వైద్యులు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
‘గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రి నుంచి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్ డిశ్చార్జి అయ్యారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పటికీ మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. అ తర్వాత ఆయన యాధావిధిగా తన బాధ్యతల్లో మునిగిపోవచ్చు’ అని డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ అనిల్ బీజీ మీడియాకు తెలిపారు.
Tamil Nadu CM MK Stalin has been declared fit for discharge after successfully recovering from the therapeutic procedure done by the expert team. CM is being discharged this evening from Apollo Hospitals, Greams Road and has been advised to resume his normal routine after three… pic.twitter.com/9nil8IHMCO
— ANI (@ANI) July 27, 2025
డీఎంకే అధినేత అయిన స్టాలిన్ జూన్ 21న ఉదయపు నడకు వెళ్లిన సమయంలో తలతిరిగడంతో ఇబ్బంది పడ్డారు. వెంటనే ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్స కొనసాగించారు. ఆరు రోజులకు స్టాలిన్ ఆరోగ్యం మెరుగవ్వడంతో ఆదివారం డిశ్చార్జి చేశారు.