చందంపేట, జూలై 27 : గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యాలు కల్పించి అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా ఇంచార్జి మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని పోలేపల్లి వద్ద ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి లక్ష్మణ్ లబ్ధిదారులకు రేషన్ కార్డు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేస్తామని అన్నారు. దేవరకొండ ప్రాంతంలో అధిక నిధులు కేటాయించి గిరిజన ప్రాంతమైన అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని అన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ నక్కలగండి పనులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చందంపేట, నేరేడుగుము మండలంలోని సుమారు 2800 వందల మందికి లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, జెసి శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, తాసిల్దార్ లు ఉన్నారు.