IPL 2025 : వాంఖడేలో రెచ్చిపోయే ఆడే ముంబై ఇండియన్స్ బ్యాటర్లకు గుజరాత్ బౌలర్లు ముకుతాడు వేశారు. టాపార్డర్‌లో విల్ జాక్స్(53) అర్ధ శతకంతో చెలరేగగా.. 97-3తో పటిష్టంగా ఉన్న ముంబై.. మిడిల్ ఓవర్లలో సాయి కిశోర్(2-34), రషీద్ ఖాన్(1-21)ల విజృంభణతో వరుసగా వికెట్లు కోల్పోయింది. దాంతో, ఆ జట్టు స్కోర్ 130 దాటడమే గగనం అనిపించింది. కానీ, ఆల్‌రౌండర్ కార్బిన్ బాస్చ్(2) డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన 20వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు సబాదాడు. ఆఖరి బంతికి దీపక్ చాహర్ బౌండరీ కొట్టడంతో ముంబై 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
ఆరు విజయాలతో జోరుమీదున్నముంబై ఇండియన్స్ వాంఖడేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. అయితే.. గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ధాటికి ప్రధాన ఆటగాళ్లు బ్యాట్లెత్తేశారు. పవర్ ప్లేలో మూడు క్యాచ్‌లు వదిలేసినా భారీ స్కోర్ చేయలేకపోయింది. టాస్ ఓడిన ముంబైకి సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రియాన్ రికెల్టన్(2)ను సిరాజ్ ఔట్ చేశాడు. అయితే..ఆ తర్వాత బంతికే విల్ జాక్స్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సుదర్శన్ నేలపాలు చేశాడు.
Will Jacks laying a foundation with his first 5️⃣0️⃣ of the season 👏
Meanwhile Sai Kishore gets his 1⃣st wicket of the night!
Surya Kumar Yadav departs.
Updates ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/walgyvolH1
— IndianPremierLeague (@IPL) May 6, 2025
లైఫ్ లభించడంతో జాక్స్ బౌండరీలతో రెచ్చిపోయాడు. అయితే.. డేంజరస్ రోహిత్ శర్మ(7)ను అర్షద్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(35)తో కలిసి జాక్స్ దంచేయగా ముంబై 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. గుజరాత్ స్పిన్నర్లను బాదేసిన ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించి ముంబైని ఆదుకున్నారు.
ఓపెనర్లు త్వరగా పెవిలియన్ చేరినా జాక్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. దంచికొడుతున్న సూర్యను సాయి కిశోర్ ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కాసేపటకే ఈ సీజన్లో తొలి అర్థ శతకం సాధించిన జాక్స్‌ను రషీద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా(1), తిలక్ వర్మ (7)లు విఫలం కాగా.. నమన్ ధిర్(7) ప్రసిధ్ ఓవర్లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
𝗢𝘂𝘁𝗳𝗼𝘅𝗶𝗻𝗴 𝘄𝗶𝘁𝗵 𝘀𝗽𝗶𝗻 😎
2⃣ big wickets added to Sai Kishore’s tally ✅#MI 111/5 after 13 overs.
Updates ▶ https://t.co/DdKG6ZnEXS #TATAIPL | #MIvGT | @saik_99 | @gujarat_titans pic.twitter.com/3ttCilw8cN
— IndianPremierLeague (@IPL) May 6, 2025
ఆ తర్వాత టెయిలెండర్లు కార్బిన్ బాస్చ్(27), దీపక్ చాహర్(8 నాటౌట్)ల పోరాడారు. 20 ఓవర్లో తొలి బంతిని బాస్చ్ స్టాండ్స్‌లోకి పంపాడు. స్వీప్ షాట్‌తో రెండో బంతిని సిక్సర్‌గా మలవగా ముంబై 150కి చేరువైంది. కానీ, బట్లర్ అతడిని రనౌట్ చేసి ముంబైకి షాకిచ్చాడు. అయితే.. ఆఖరి బంతికి చాహర్ ఫోర్ బాదడంతో ముంబై ప్రత్యర్థికి 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Innings break! @mipaltan post a total of 155/8 on board 👏
Will Gujarat Titans chase this down and move 🔝 of the table? 🤔
Updates ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/Sinl6RdL9h
— IndianPremierLeague (@IPL) May 6, 2025