Sonu Nigam | బాలీవుడ్‌కు ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌పై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఆయనకు నోటీసులు సైతం జారీ చేశారు. ఇటీవల ఆయన బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆరోపణలున్నాయి. ఇటీవల బెంగళూరులో సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన పాటలు పాడుతుండగా.. ఓ అభిమాని కారణంగా ఆయన వివాదంలో చిక్కుకున్నారు. సోనూ నిగమ్ కన్నడ భాషను అవమానించేలా, భాషా విద్వేషాన్ని ప్రేరేపించేలా మాట్లాడని ఆరోపిస్తూ కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు సిటీ యూనిట్ అధ్యక్షుడు ధర్మరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు. వారంలోగా విచారణకు హాజరుకావాలని కోరారు. మరో వైపు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ఘటనపై స్పందించింది. సోనూ నిగమ్‌పై తాత్కాలికంగా నిషేధం విధించినట్లుగా సమాచారం. అయితే, ఈ వ్యవహారంపై సోనూ నిగమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. నిజాయతీగా చెప్పాలంటే, కర్నాటక రాష్ట్రం, కన్నడ భాష, సంస్కృతి, కళాకారులపై తనకు అపారమైన ప్రేమ, గౌరవం ఉందన్నారు. తాను హిందీ పాటల కన్నా ఎక్కువగా కన్నడ పాటలనే ఆస్వాదిస్తానని.. బెంగళూరులో ప్రదర్శనకు ముందు ఎక్కువ సమయం కన్నడ పాటల సాధనకే కేటాయిస్తానన్నారు.
ఘటన గురించి వివరిస్తూ.. ఆ రోజున వయసులో సగం కూడా లేని ఓ వ్యక్తి వేలాది మంది ముందు నన్ను అమర్యాదగా బెదిరించడం తనను బాధించిందన్నారు. షో ఇప్పుడే మొదలైందని.. ప్రణాళిక ప్రకారమే కొనసాగుతుందని అతనికి మర్యాదగానే సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. సాంకేతిక కారణాలను కూడా ప్రస్తారించారని.. ముందుగానే ఎంపిక చేసిన పాటల జాబితా ఉంటుందన్నారు. దాని ప్రకారమే గాయకులు, సాంకేతిక నిపుణులు సైతం సిద్ధంగా ఉంటారన్నారు. హఠాత్తుగా వేరే పాటలు పాడమని అడిగితే సాధ్యం కాదని.. సాంకేతిక బృందం ఇబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అయితే, పోలీసులు జారీ చేసిన నోటీసులపై ఆయన స్పందించలేదు.