IPL 2025 : సొంతమైదానంలో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్(53) అర్ధ శతకంతో చెలరేగాడు. పవర్ ప్లేలో రెండు లైఫ్స్ లభించడంతో రెచ్చిపోయిన అతడు హాఫ్ సెంచరీతో విజృంభించాడు. ధాటిగా ఆడబోయిన ఈ హిట్టర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత సాయి కిశోర్, గెరాల్డ్ కొయెట్జీలు గర్జించగా.. హార్దిక్ పాండ్యా(1), తిలక్ వర్మ(7)లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. 15 ఓవర్లకు ముంబై 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ప్రస్తుతం నమన్ ధిర్(2), కార్బిన్ బాస్చ్(2)లు క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడిన ముంబైకి సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రియాన్ రికెల్టన్(2)ను సిరాజ్ ఔట్ చేశాడు. అయితే..ఆ తర్వాత బంతికే విల్ జాక్స్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సుదర్శన్ నేలపాలు చేశాడు. లైఫ్ లభించడంతో జాక్స్ బౌండరీలతో రెచ్చిపోయాడు. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో మూడేసీ ఫోర్లతో అలరించాడు.
Will Jacks laying a foundation with his first 5️⃣0️⃣ of the season 👏
Meanwhile Sai Kishore gets his 1⃣st wicket of the night!
Surya Kumar Yadav departs.
Updates ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/walgyvolH1
— IndianPremierLeague (@IPL) May 6, 2025
అయితే.. కాసేపటికే అర్షద్ ఓవర్లో పెద్ద షాట్ ఆడే క్రమంలో ప్రసిధ్ చేతికి చిక్కాడు హిట్‌మ్యాన్ రోహిత్(7). దాంతో 26 వద్ద ముంబై రెండో వికెట్ పడింది. కానీ, మరో ఎండ్‌లో ధాటిగా ఆడుతున్న సూరయకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను సాయి కిశోర్ అందుకోలేకపోయాడు. ఇక పవర్ ప్లే చివరి ఓవర్లో జాక్స్ లెగ్‌సైడ్ గాల్లోకి లేపిన బంతిని సిరాజ్ ఒడిసిపట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత సూర్యతో కలిసి ధనాధన్ ఆడిన జాక్స్ ఈ సీజన్లో తొలి అర్థ శతకం సాధించాడు.