Nayanthara | నయనతార గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తనదైన సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే దక్షిణాదిలో లేడి సూపర్‌స్టార్‌గా పేరును సాధించింది. రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ హవా కొనసాగిస్తుంది. తాజాగా వార్తల్లో నిలిచింది. మెగాస్టార్ సినిమాలో జతకట్టనున్నది. ఈ ప్రతిష్టాత్మక మూవీకి రూ.18కోట్లు డిమాండ్ చేసినట్లు టాలీవుడ్ సర్కిల్లో వార్త తెగ చెక్కర్లు కొడుతున్నది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ‘టెస్ట్’లో నయన్ కనిపించింది.
ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం పెళ్లి చేసుకొని ఇద్దరు కవలలతో సరదాగా గడుపుతూ.. మరో వైపు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. తొలిసారిగా బాలీవుడ్లో షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ మూవీలో నటించగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి రూ.12కోట్ల పారితోషకం అందుకున్నట్లు టాక్. అయితే, ఈ మూవీతో తన మార్కెట్‌ని దృష్టిలో పెంచుకొని రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లు టాక్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్నది. ఈ మూవీలో హీరోయిన్గా నయన్‌ను తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ క్రమంలో లేడి సూపర్‌స్టార్‌ను సంప్రదించగా.. మూవీకి రూ.18కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్. ప్రస్తుతం నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
నయన్ డిమాండ్‌కు నిర్మాతలు తలొగ్గితే.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకున్న నటిగా నయన్ నిలువనున్నది. చిరంజీవి సరసన ఇప్పటికే నయన్ సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్లో మూడో చిత్రం వస్తుందా? లేదా? అనేది త్వరలోనే తేలనున్నది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నయన్ ఏడు సినిమాల్లో నటిస్తున్నది. టాక్సిక్, మన్నగట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్, ఎంఎంఎంఎన్, అమ్మోరు తల్లి-2, హాయ్, రక్కాయి మూవీల్లో నటిస్తున్నది.