Ishan Kishan : భారత క్రికెట్ భావి తారల్లో ఒకడైన ఇషాన్ కిషన్ టీ20ల్లో సంచలనాలకు మారు పేరు. ముంబై ఇండియన్స్ తరఫున చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు.. ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగాడు. ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ ఈ లీగ్‌లో మొదటి వంద కొట్టేశాడు. లాంగాఫ్, లాంగాన్.. ఫైన్‌లెగ్ ఇలా మైదానం నలువైపులా షాట్లు కొట్టిన ఇషాన్ కేవలం 45 బంతుల్లోనే మూడంకెల స్కోర్ సాధించాడు.
ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్‌లో ఉన్నాయంటే 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయంటే.. అతడు రాజస్థాన్ బౌలర్లపై ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. అయితే.. రెండేళ్లుగా ఇషాన్ అంతర్జాతీయ కెరియర్ సందిగ్ధంలో పడింది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశం వచ్చిన అతడు.. బీసీసీఐ వేటుకు బలయ్యాడు. రంజీల్లో ఆడనందుకు ఇషాన్ సెంట్రల్ కోల్పోయాడు. కెరియర్లో ఎదుగుతున్న సమయంలోనే ఇలా జరగడంతో .. మళ్లీ పునరాగమనంపై దృష్టి సారించాడు ఇషాన్. అందుకే.. ఈ సెంచరీ అతడికి ఎంతో ప్రత్యేకమని చెప్పాలి.
𝙄.𝘾.𝙔.𝙈.𝙄 🔥
Ishan Kishan dealt in sixes on his way to a magnificent maiden #TATAIPL 💯 😮 👊
Updates ▶ https://t.co/ltVZAvHPP8#SRHvRR | @SunRisers | @ishankishan51 pic.twitter.com/9PjtQK231J
— IndianPremierLeague (@IPL) March 23, 2025
పట్నాకు చెందిన ఇషాన్ 16 ఏళ్ల నుంచే క్రికెట్‌ను ప్రాణంగా భావించాడు. వికెట్ కీపర్‌గా, హిట్టర్‌గా రాణించి జార్ఖండ్ తరఫున 2014లో ఫస్ల్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడడంలో దిట్టగా పేరొందని ఇషాన్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 2016 వేలంలో ముంబై ఇండియన్స్ ఈ డాషింగ్ బ్యాటర్‌ను రూ.35 లక్షలకు సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో.. ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా తనదైన ముద్ర వేశాడు ఇషాన్. ఇక 2022లో ఏకంగా రూ.15.25 కోట్లతో విలువైన ఆటగాడిగా నిలిచాడు. దాదాపు ఏడేళ్లకు పైగా ముంబై ఇండియన్స్ జట్టుకు విశేష సేవలందించి.. ఆ జట్టు ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఇషాన్.
నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో సర్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇషాన్‌ను రూ.11.5 కోట్లకు కొన్నది. తనపై భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్రాంచైజీ నమ్మకాన్ని మొదటి మ్యాచ్‌లోనే నిలబెట్టుకున్నాడీ కుర్రాడు. మామూలుగా.. గత రెండు సీజన్ల నుంచి ఎస్ ఆర్హెచ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల జోడీ సూపర్ హిట్టైంది. వీళ్ల తర్వాత ఆ స్థాయిలో దంచికొట్టగల ఆటగాడిగా హెన్రిచ్ క్లాసెన్ పేరు గడించాడు. వీళ్లే కాదు నేను రఫ్ఫాడించగలను అంటూ ఇషాన్ ఉప్పల్ మైదానంలో శివాలెత్తిపోయాడు.
హైదారబాద్ ఫ్రాంచైజీ తరఫున తొలి మ్యాచ్‌లోనే తన బ్యాట్ పవర్ చూపించాడీ హిట్టర్. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూనే సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. 19వ ఓవర్లో సందీప్ శర్మను బురిడీ కొట్టిస్తూ రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదిన ఈ యంగ్‌స్టర్.. ఆ తర్వాత డబుల్స్‌తో తన ఐపీఎల్ సెంచరీ కలను సాకారం చేసుకున్నాడు. ఇంతకుముందు ఐపీఎల్లో ఇషాన్ అత్యధిక వ్యక్తిగత స్కోర్.. 99. ఇప్పటివరకూ 2,644 పరుగులు చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఖాతాలో 16 అర్థ శతకాలు ఉన్నాయి.
ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ఇషాన్ వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపి.. తానెంత ప్రమాదకరమో చాటాడు. మొదట హెడ్, నితీశ్ రెడ్డిలతో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్.. ఆ తర్వాత క్లాసెన్‌తో కలిసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లోనే 55 రన్స్ కొట్టిన ఈ ద్వయాన్ని సందీప్ శర్మ విడదీసి రాజస్థాన్‌కు బ్రేకిచ్చాడు. అయితే.. అదే ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది.. 2 రన్స్ తీసిన ఇషాన్ తొలి సెంచరీ సాధించాడు. 20వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.. తమ రికార్డు స్కోర్ 287ను అధిగమించే అవకాశాన్ని చేజార్చుకుంది.
ISHAN ‘THE CENTURION’ KISHAN 😮💨🔥#PlayWithFire | #SRHvRR | #TATAIPL2025 pic.twitter.com/MVAFEy34Tn
— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2025