watch: దేవుడిగా చెప్పుకునే పాస్టర్.. ఒక వ్యక్తితోపాటు మహిళపై దాడి, వీడియో వైరల్
Bajinder Singh | తనను దేవుడిగా చెప్పుకునే పాస్టర్ తన సిబ్బందిపై దాడి చేశాడు. ఒక వ్యక్తితోపాటు మహిళపై పలు వస్తువులు విసిరేశాడు. వారి చెంపలపై కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చండీగఢ్: తనను దేవుడిగా చెప్పుకునే పాస్టర్ తన సిబ్బందిపై దాడి చేశాడు. ఒక వ్యక్తితోపాటు మహిళపై పలు వస్తువులు విసిరేశాడు. వారి చెంపలపై కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్‌లోని జలంధర్‌లో ఈ సంఘటన జరిగింది. తనను తాను దైవంగా చెప్పుకునే పాస్టర్ బజిందర్ సింగ్ (Bajinder Singh) ‘ది చర్చ్ ఆఫ్ గ్లోరీ అండ్ విజ్డమ్’కు నేతృత్వం వహిస్తున్నాడు. తనను తాను ‘ప్రవక్త బజిందర్’గా పిలుచుకునేవాడు.
కాగా, గత నెలలో బజిందర్ సింగ్ తన కార్యాలయంలో రెచ్చిపోయాడు. అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొలుత ఒక వ్యక్తిపై పలు వస్తువులు విసిరేశాడు. ఆ తర్వాత అతడి వద్దకు వెళ్లి చెంపపై కొట్టాడు.
మరోవైపు ఒక బాబుతో ఉన్న మహిళను బజిందర్ సింగ్ హెచ్చరించాడు. ఆమెతో దురుసుగా మాట్లాడాడు. ఆ మహిళ బదులు చెప్పడంతో టేబుల్‌పై ఉన్న వస్తువులు విసిరేశాడు. ప్రతిఘటించిన ఆమె చెంపపై పలుసార్లు కొట్టాడు. ఇంతలో అక్కడున్న వ్యక్తులు జోక్యం చేసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇప్పటికే ఒక మహిళ ఫిర్యాదుతో బజిందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు కూడా నమోదైంది.
CCTV footage of self-styled Christian prophet Baljinder Singh’s office has gone viral, showing him beating his employees, including women. The footage is reportedly from February 2025. Notably, just a few days earlier, the Kapurthala Police had registered an FIR against him under… pic.twitter.com/x2JXF84JAt
— Gagandeep Singh (@Gagan4344) March 23, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

