Medical camp | కారేపల్లి, మార్చి 23 : మండల పరిధిలోని మాదారంలో గల ఏజీసీఎం ఏసుక్రీస్తు ప్రార్ధన మందిరం ప్రాంగణంలో ఇవాళ ఖమ్మం పట్టణానికి చెందిన అభయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
దైవ వర్తమానికులు ఎం ఏలియా ఆధ్వర్యంలో అభయ హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, చిన్న పిల్లల వైద్య నిపుణులు కూరపాటి ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో ప్రముఖ వైద్యులు సుదానా సిద్ధార్థ, పరకాల రాము గౌడ్, బాల కృష్ణయ్యలు గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు.
ఈ సందర్భంగా పాస్టర్ ఏలియా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శస్త్ర చికిత్సలు అవసరం ఉన్నవారిని ఖమ్మం తరలించి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాన్ వెస్లీ (కాసాని శ్రీనివాస రావు) సత్యపాల్, థామస్, సైమాన్ తదితరులు పాల్గొన్నారు.
Current Wires | ఇంటిపై విద్యుత్ తీగలు.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?