NTR| విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఎన్టీఆర్ ఆనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఖ్యాతి ఎల్లలు దాటింది. ఇక దేవర సినిమాతో కూడా ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. చివరిగా ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం 2024 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు.
దేవర: పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. 6 కేంద్రాల్లో 100 రోజులు, మరో 2 కేంద్రాల్లో కంటిన్యూ ఆటతో 100 రోజులు పూర్తి చేసుకుంది దేవర సినిమా. నాన్-ఇంగ్లీష్ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలతో నాలుగో స్థానం దక్కించుకుంది ఈ మూవి. అయితే ఎన్టీఆర్‌కి జపాన్‌లోను విపరీతమైన క్రేజ్ ఉన్న నేపథ్యంలో మూవీని మార్చి 19, 2025న జపాన్‌లో ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్ జరిపారు. పాజిటివ్ టాక్ వచ్చింది. మార్చి 28న చిత్రాన్ని అక్కడ విడుదల చేయబోతున్నారు. జపనీస్ భాషలో ‘దేవర’ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ సైతం భారీగానే ప్లాన్ చేశారు. ఇటీవలే ఎన్టీఆర్ జపాన్ మీడియాకు ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు.
తాజాగా ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి జపాన్‌లో అడుగుపెట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కొందరు ఫ్యాన్స్‌కు ఆయన ఆటోగ్రాఫ్ ఇవ్వగా, అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడ విడుదలై పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో జపాన్ ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవల ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో జపాన్ అమ్మాయిలు ఎన్టీఆర్ కటౌట్ పెట్టి దానికి పూజ చేస్తున్నారు. ఇది కదా ఎన్టీఆర్ క్రేజ్ అంటూ తెలుగు ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేశారు. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడానటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు తారక్.