‘కోర్ట్’ జోడీ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. మార్చి 13న విడుదల కానున్నది. తొలి పాట శనివారం విడుదలైంది. ‘తిప్పుకుంటన్నవ్..’ అంటూ సాగే ఈ పాటను అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి తన వ్యక్తిగత సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
చంద్రబోస్ రాసిన ఈ పాటకు విజయ్ బుల్గానిన్ స్వరపరచగా, రాము రాథోడ్, అదితి భావరాజు ఆలపించారు. వెంకటేష్ కాపు కొరియోగ్రఫీ అందించారు. శ్రీదేవి, హర్ష్ రోషన్‌పై ఆయన డిజైన్ చేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈచిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సమర్పణ: మ్యాంగో మాస్ మీడియా, నిర్మాణం: కోన ఫిల్మ్ కార్పొరేషన్.