162 లక్షల కోట్లకు.. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ రుణాల బకాయిలు
గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ రుణాల బకాయిలు 18.1 శాతం పెరిగి రూ.162 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ముంబై, ఫిబ్రవరి 24: గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ రుణాల బకాయిలు 18.1 శాతం పెరిగి రూ.162 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో గోల్డ్ లోన్లకు ఏర్పడిన గిరాకీ, పండుగల సీజన్, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) హేతుబద్ధీకరణ ఇందుకు కారణమని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (సీఐసీ) క్రిఫ్ హై మార్క్ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి.
కాగా, ఈ రిటైల్ రుణాల బకాయిల్లో గత త్రైమాసికం గృహ రుణాల వాటా అత్యధికంగా 10.50 శాతం ఎగిసింది. రూ.43 లక్షల కోట్లను తాకినట్టు సీఐసీ తెలిపింది. అలాగే గోల్డ్ లోన్ల బకాయిలు 44.1 శాతం వృద్ధితో రూ.16.2 లక్షల కోట్లకు, వ్యక్తిగత రుణాల బకాయిలు 11.6 శాతం పెరుగుదలతో రూ.15.90 లక్షల కోట్లకు చేరాయి. తగ్గిన జీఎస్టీ రేట్లు.. కార్లు, ద్విచక్ర వాహనాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లలో ఏడాది క్రితంతో పోల్చితే వరుసగా 14.60 శాతం, 12.30 శాతం, 14.30 శాతం చొప్పున వృద్ధికి దోహదం చేశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

